![]() |
![]() |

యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ చూసిన ఒకటే మ్యూజిక్.. అమ్మ పాడే జోలపాట అమృతానికన్న తీయనంట.. ఇదే పాట.. ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ లో తెగ వైరల్ అవుతున్న ఈ పాట గురించి తెలుసుకుందాం.
మన తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మ ఎమోషన్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ప్రతీ సినిమా హిట్ అయింది. ప్రతీ సీను ఎక్కువ మందిని కట్టిపడేస్తుంది. అప్పటి అమ్మ రాజీనామా సినిమా నుండి మొదలుకొని ఇప్పటి బహుబలి, కెజిఎఫ్ వరకు అమ్మ పాత్రలకి వారితో కొడుకులకి ఉండే ఎమోషనల్ బాండింగ్ ని ప్రేక్షకులు మర్చిపోరు. తాజాగా యూట్యూబ్ లో అమ్మ గురించి ఓ రచయిత అద్భుతమైన లిరిక్స్ రాసాడు. ఈ పాటని ఓ కొత్త సింగర్ పాడడంతో .. దీనికి మరింత ఫ్రెష్ నెస్ లభించింది. ఆ పాట పేరు " అమ్మ పాడే జోల పాట". సురేందర్ మిట్టపల్లి రాసిన ఈ పాటని ఎర్రమ్ జాహ్నవి పాడింది. సిస్కో డొస్కో మ్యూజిక్ అందించగా.. కర్రి అశోక్ ఎడిటింగ్ చేశాడు. ఇక ఈ పాట ' మిట్టపల్లి స్టూడియో' యూట్యూబ్ ఛానెల్ లో నాలుగు వారాల క్రితం రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు ఈ పాటని దాదాపు రెండు కోట్ల యాభై లక్షల పైచిలుకు మంది చూశారు.
ఇక ఈ పాట ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో అమ్మ పాడే జోల పాట అనే లిరిక్స్ విని.. ఏంట్రా ఈ పాట ఇంత ఫ్రెష్ గా ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో ఈ పాట ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో బెస్ట్ మ్యూజిక్ అండ్ సాంగ్ ఆఫ్ ది యూట్యూబ్ లిస్ట్ లో 21 వ స్థానంలో ఉంది. మరి ఇంత పాపులర్ అయిన ఈ పాటని మీరు మిస్ అయితే చూసేయ్యండి.
![]() |
![]() |